HAL Non-Executive Cadre job recruitment 2024 in Hyderabad | HAL Recruitment 2024 | Govt jobs Telugu
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి HINDUSTAN AERONAUTICS LIMITED లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల Non-Executive Cadre ఖాళీల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు. అన్నీ రకాల ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్నీ రకాల ప్రమాణాలు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
కేంద్ర ప్రభుత్వ ప్రముఖ సంస్థ అయినటువంటి HINDUSTAN AERONAUTICS LIMITED సంస్థ నుండి వివిధ రకాల Non-Executive Cadre ఖాళీల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైస్ కంపెనీ హైదరాబాద్ డివిజన్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ undertaking సంస్థ నుండి ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ డివిజన్ నుండి నాన్-ఎగ్జిక్యూటివ్ డిప్లొమా టెక్నీషియన్ మరియు ఆపరేషన్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు :
ఈ కంపెనీ లో వివిధ డిపార్ట్మెంట్ లో వివిధ ట్రేడ్ ఖాళీల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) : SC-01, OBC-2, EWS-01,UR-04 పోస్టులు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) : FSR, OBC-2, EWS-01,UR-04 పోస్టులు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలెక్ట్రికల్) : OBC-1,UR-01 పోస్టులు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలెక్ట్రికల్) -FSR : SC-01, OBC-1,UR-01 పోస్టులు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్) : SC-03,ST-02,OBC-5, EWS-03,UR-08 పోస్టులు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్)-FSR : SC-02,ST-01,OBC-4, EWS-02,UR-05 పోస్టులు ఉన్నాయి.
- డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్) : UR-01 పోస్టులు ఉన్నాయి.
- ఆపరేటర్(ఎలక్ట్రానిక్ మెకానిక్) : OBC-01, UR-01 పోస్టులు ఉన్నాయి.
- ఆపరేటర్( ఫిట్టర్) : UR-01 పోస్టులు ఉన్నాయి.
- ఆపరేటర్(పేయింటర్) : OBC-01, UR-01 పోస్టులు ఉన్నాయి.
- ఆపరేటర్( టర్నర్): UR-01 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
- డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్ టైమ్/రెగ్యులర్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) FSR : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్ టైమ్/రెగ్యులర్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఎక్స్-సర్విస్ మ్యాన్ / ఇండియన్ ఎయిర్ ఫోర్స్/నేవీ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలెక్ట్రికల్) : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్ టైమ్/రెగ్యులర్ డిప్లొమా ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలెక్ట్రికల్) -FSR : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్ టైమ్/రెగ్యులర్ డిప్లొమా ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్) : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్ టైమ్/రెగ్యులర్ డిప్లొమా ఎలక్ట్రానిక్,కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్)-FSR : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్ టైమ్/రెగ్యులర్ డిప్లొమా ఎలక్ట్రానిక్,కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్) : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్ టైమ్/రెగ్యులర్ డిప్లొమా Msc కెమికల్ పాస్ అయిన వాళ్ళు లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఆపరేటర్(ఎలక్ట్రానిక్ మెకానిక్) : NAC 3 years లేదా ITI లో ఎలక్ట్రానిక్ మెకానిక్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఆపరేటర్( ఫిట్టర్) : NAC 3 years లేదా ITI లో ఫిట్టర్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఆపరేటర్(పేయింటర్) : NAC 3 years లేదా ITI లో పేయింటర్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఆపరేటర్( టర్నర్): NAC 3 years లేదా ITI లో టర్నర్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం వివరాలు (Salary) :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ట్రైనింగ్ సమయం లో జీతం వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- డిప్లొమా టెక్నీషియన్ : నెలకు Rs. 23,000/- జీతం చెల్లిస్తారు.
- ఆపరేటర్ : నెలకు Rs. 22,000/- జీతం చెల్లిస్తారు.
ట్రైనింగ్ వ్యవది & ట్రైనింగ్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి maximum 4-years పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ 4-years పాటు ట్రైనింగ్ లో మీకు జీతం చెల్లిస్తారు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఇండక్షన్ ట్రైనింగ్ పీరియడ్ 8 weeks పాటు ట్రైనింగ్ ఇస్తారు.
పని చేసే ప్రదేశం :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి హైదరాబాద్ డివిజన్ మరియు IAF bases లైక్ శ్రీనగర్, సిర్సా, భటిండా,ఘోరఖపుర్, వాలివర్,తేజ్పుర్,చబుయా, హసీమర,బీదర్,పూణే,భూజ, గోవా ఇలా మరి కొన్ని ప్రదేశాల్లో ట్రైనింగ్ ఇస్తారు మరియు పని చేయాల్సి ఉంటుంది.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 28-years వయస్సు మించి ఉండకూడదు. SC/ ST/ EWS/ OBC etc.. కేటగిరి బట్టి 3-years నుండి 10-years వయస్సు సడలింపు ఉంటుంది.
- SC/ST Upper age లిమిట్ కింద 5-years పాటు age relaxable ఉంటుంది.
- OBC-NCL Upper age లిమిట్ కింద 3-years పాటు age relaxable ఉంటుంది.
- PwBDs Upper age లిమిట్ కింద 10-years పాటు age relaxable ఉంటుంది.
- Ex-Serviceman Upper age లిమిట్ కింద 3-years పాటు age relaxable ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు Rs. 200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. UR/OBC/OBC-NCL/EWS అభ్యర్థులకి ఫీజు ఉంటుంది. మరియు SC/ST/PWD/ Ex-apprentice అభ్యర్థులకి ఎటువంటి ఫీజు ఉండదు.
కావలసిన డాక్యుమెంట్స్ :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే ముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది దానికి కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు కింద ఇవ్వబడింది.
- వాలిడ్ ఈమెయిల్ ఉండాలి .
- caste/ tribe సర్టిఫికేట్ ఉండాలి.
- అన్నీ రకాల సర్టిఫికేట్ ఉండాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- మీ సిగ్నేచర్/సంతకం ఉండాలి.
- మీ ఎంప్లాయ్మెంట్/పోస్ట్ క్వాలిఫికేషన్స్ డీటైల్స్ వివరాలు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకి హైదరాబాద్ నగరంలో written test నిర్వహిస్తారు. ఆ ఎక్సామ్ 22-12-2024 నాడు నిర్వహిస్తారు. ఆ ఎక్సామ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మెరిట్ లిస్ట్ ద్వారా మెడికల్ examination నిర్వహిస్తారు. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకి ఉద్యోగం వస్తుంది.
అప్లికేషన్ చేసే విధానం :
- మొదటగా మీరు HAL అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
- ఓపెన్ చేశాక కెరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ నోటిఫికేషన్ వివరాలు కనిపిస్తుంది.
- నోటిఫికేషన్ లో ఉన్న వివరాలు అన్నీ చూసి అర్హత ఉన్న ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోండి.
- మీ పూర్తి డీటైల్స్ అన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
- మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ లో చూడవచ్చు.
Notification : Click Here
Apply Link : Click Here