AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

ఆంధ్ర బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు 2024 నోటిఫికేషన్ |UBI LBO Notification 2024

ఏదైనా బ్యాంక్ సంస్థ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ బ్యాంక్ సంస్థ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి 1500 Local Bank Officer అనే ఉద్యోగాల భార్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫీసు లో ఉద్యోగ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీ జిల్లాలో ఉన్న బ్యాంక్ లో పోస్టింగ్ ఇస్తారు. ఈ ఆర్టికల్ లో ఈ బ్యాంక్ నోటిఫికేషన్ కి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత, వయస్సు,జీతం, అప్లికేషన్ ప్రాసెస్,ఫీజు వివరాలు,ఎంపిక విధానం, కావలసిన డాక్యుమెంట్స్ ఇలా పూర్తి వివరాలు చూసి అర్హులు అయిన వాళ్ళు Apply చేసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్-పోస్టుల వివరాలు :

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మొత్తం 200 Local Bank Officer(LBO) ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్ చెందిన SC, ST,OBC, EWS, UR అభ్యర్థులు అర్హులు మరియు ఆయా జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తారు. మీరు మన లోకల్ తెలుగు బాష మీదనే పని చేయాల్సి వస్తుంది. దీంట్లో SC-30 పోస్టులు, ST-15 పోస్టులు, OBC-54 పోస్టులు,EWS-20 పోస్టులు,UR-81 పోస్టులు ఇలా మొత్తం 200 ఉద్యోగాలు ఉన్నాయి.

తెలంగాణ-పోస్టుల వివరాలు :

తెలంగాణ లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మొత్తం 200 Local Bank Officer(LBO) ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి తెలంగాణ చెందిన SC, ST,OBC, EWS, UR అభ్యర్థులు అర్హులు మరియు ఆయా జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తారు. మీరు మన లోకల్ తెలుగు బాష మీదనే పని చేయాల్సి వస్తుంది. దీంట్లో SC-30 పోస్టులు, ST-15 పోస్టులు, OBC-54 పోస్టులు,EWS-20 పోస్టులు,UR-81 పోస్టులు ఇలా మొత్తం 200 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హత, వయస్సు వివరాలు :

ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ కి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి Degree పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. మీ దగ్గర మార్క్ షీట్,డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. వయస్సు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అర్హులు. SC,ST,OBC అభ్యర్థులకి 03 సంవత్సరాల నుండి 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన అభ్యర్థులకి నెలకు *48,480/- నుండి *85,920/- జీతం చెల్లిస్తారు.

Probation వ్యవది :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 2 సంవత్సరాల పాటు ఆక్టివ్ సర్విస్ ఉంటుంది ఏ డేట్ కి బ్యాంక్ లో జాయిన్ అవుతారో ఆ డేట్ నుండి.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online Examination/ Group Discussion or Personal Interview నిర్వహిస్తారు. ఎక్సామ్ లో మెరిట్ లిస్ట్ candidates కి ఆన్లైన్ ఎక్సామ్ మార్క్స్ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దాని తర్వాత Merit List లో ఉన్న అభ్యర్థులకి తెలుగు రాష్టాల్లో పోస్టింగ్ ఇస్తారు. ఆన్లైన్ ఎక్సామ్ సిలబస్ కింద ఇవ్వబడింది చూడగలరు. మొత్తం 200 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో qualify అయిన అభ్యర్థులకి నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి.

  • రీజనింగ్& కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు నుండి 60 మార్కులు/ 45 క్వశ్చన్ & ఇంగ్షీషు మరియు హిందీ లో పరీక్ష ఉంటుంది.
  • జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్/awareness సబ్జెక్టు నుండి 40 మార్కులు/40 క్వశ్చన్ & ఇంగ్షీషు మరియు హిందీ లో పరీక్ష ఉంటుంది.
  • డాటా అనాలిసిస్/ఇంటర్ప్రిటేషన్ సబ్జెక్టు నుండి 60 మార్కులు/35 క్వశ్చన్ & ఇంగ్షీషు మరియు హిందీ లో పరీక్ష ఉంటుంది.
  • ఇంగ్షీషు లాంగ్వేజ్ సబ్జెక్టు నుండి 40 మార్కులు/ 35 క్వశ్చన్ & ఇంగ్షీషు మరియు హిందీ లో పరీక్ష ఉంటుంది.
  • ఇంగ్షీషు లాంగ్వేజ్(రైటింగ్& ఎస్సే) 25 మార్కులు/ 02 క్వశ్చన్ & ఇంగ్షీషు మరియు హిందీ లో పరీక్ష ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

GEN, EWS, OBC అభ్యర్థులు 850/- ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD అభ్యర్థులు 175/- ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ మీ ఫీజు కట్టవచ్చు.

పరీక్ష కేంద్రాలు :

మీరు ఇక్కడ ఉన్న లొకేషన్ లో ఉన్న ఎక్సామ్ సెంటర్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి అర్హులు అయిన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, అనంతపూర్, ఏలూరు, గుంటూర్, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూర్, ఒంగోల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం,విజయనగరం ఈ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

తెలంగాణ లో హైదరాబాద్, సికింద్రాబాద్,కరీంనగర్,ఖమ్మం,వరంగల్ ఈ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు .

ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ ఉద్యోగానికి మీరు Union Bank Of India Official వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని, తర్వాత ఫీజు చెల్లించి దాని తర్వాత మీ క్వాలిఫికేషన్స్ పూర్తి వివరాలు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసే ముందు మీరు పూర్తిగా నోటిఫికేషన్ లో ఉన్న డీటైల్స్ అన్నీ చూసి మీరు అర్హులే అయితే అప్లై చేసుకోవచ్చు.

  • మొదటగా మీరు యూనియన్ బ్యాంక్ అఫిసియల్ వెబ్సైట్ నీ ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
  • తర్వాత క్లిక్ వ్యూ కరెంట్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దాని తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2025 అని ఈ ఉద్యోగానికి రిలేట్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి apply online అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
  • న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • అక్కడ మీ పేరు, కాంటాక్ట్ డీటైల్స్. ఈమెయిల్ id, రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.
  • తర్వాత అప్లికేషన్ ఫోం ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
  • తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది, ఫోం పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత మీ పేరు,మీరు తండ్రి పేరు, ఇతర పర్సనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్, మార్కుల మేమో, ఐడెంటిటీ ప్రూఫ్ జత చేయాల్సి ఉంటుంది.
  • మీరు ఇచ్చిన వివరాలు అంతా కరెక్ట్ ఉన్నాయా లేదా సారి చూసుకొని save/next క్లిక్ చేయండి.
  • తర్వాత మీ ఫోటో మరియు సంతకం అప్లోడు చేయండి.
  • అది అంతా అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫోం సబ్మిట్ చేయండి. దాని తర్వాత పేమెంట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది.
  • పేమెంట్ ఫీజు మీరు ఆన్లైన్ ద్వారా కట్టవచ్చు.

అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ :

  • మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటో
  • 10th, 12th డిగ్రీ మార్కు లిస్ట్
  • ఏదైనా ఒక గవర్నమెంట్ ID Proof

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకునే ప్రారంభం తేదీ: 24.10.2024

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకొనే చివరి తేదీ: 13.11.2024

More Details& Apply: Notification

Apply Link: Apply

4 thoughts on “ఆంధ్ర బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు 2024 నోటిఫికేషన్ |UBI LBO Notification 2024

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *